వైశ్యలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి
ఆర్యవైశ్యలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ దేసు వెంకట ప్రసాద్ అన్నారు.
వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు స్థానిక శ్రీనివాస డైరీ మిల్క్ నందు వాసవీ క్లబ్స్ పొదిలి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్తీక వనమహోత్సవం కార్యక్రమంలో పలువురు వక్తల ప్రసంగం అనంతరం మామిడి వెంకటేశ్వర్లు సహకారంతో జీవనోపాధి కొరకు పేద మహిళకు గ్రైండర్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆర్యవైశ్యలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు…. అనంతరం పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నాయకులు మాగులురి రామప్రసాద్, చలవాది బద్రినారాయణ, సోమిశెట్టి శ్రీదేవి, సోమిశెట్టి చిరంజీవి, యాదాల సుబ్బారావు, పందిటి సునీల్, పమిడిమర్రి కృష్ణ, గునుపూడి సుబ్బారావు, కలువా రాము, గోనుగుంట్ల శ్రీను, మేడా నరసింహరావు, రావూరి ప్రసాద్, గాదంశెట్టి లక్ష్మి, జి సి సుబ్బారావు, పందిటి మురళి, తదితరులు పాల్గొన్నారు.