పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పోలీస్ స్టేషన్ నందు శనివారం ఉదయం 10 గంటలకు ఒక ద్విచక్ర వాహనం ఒక ఆటో ను వేలం నిర్వహిస్తున్నట్లు పొదిలి యస్ఐ వెంకట సైదులు శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
తేదీ 28.10.23 తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ గారి ఆదేశాల మేరకు దర్శి SDPO గారి సమక్షంలో పొదిలి పోలీస్ స్టేషన్ ఆవరణంలో Cr.No 232/2022 u/s 34(a) AP Excise Act 1995 పొదిలి పోలీస్ స్టేషన్ కేసులో సీజ్ చేసిన ద్విచక్ర వాహనం షైన్ బండి, అదేవిధంగా క్రైమ్ నెంబర్.301/2021u/s 7(a) r/w Rule 8 (e) AP P act 1995 పొదిలి పోలీస్ స్టేషన్ కేసులో సీజ్ చేయబడిన అప్పి ఆటో (ప్రయాణికులు) లకు బహిరంగ వేలం జరగును కావున ఆసక్తి కలవారు పొదిలి పోలీస్ స్టేషన్ నందు జరిగే వేలంలో పాల్గొనాల్సిందిగాపొదిలి ఎస్ఐ జి వెంకట సైదులు ఒక ప్రకటనలో తెలిపారు