ఓ టి ఎస్ రిజిస్ట్రేషన్ పై అవగాహన సదస్సు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై స్థానిక పొదిలి మండల పరిషత్ కార్యాలయం ముందు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తయారు చేసే ముందు సంబంధిత సర్వేనెంబర్ మరియు హద్దులు సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే దస్తావేజులు తయారు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గిరిజ,పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్ మరియు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు