పొదిలి,కొనకనమీట్ల ల్లో భారత్ బంద్ పాక్షికం

కేంద్రం ప్రభుత్వం ఆమోదించిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ యుపిఎ వామపక్ష పార్టీలు వివిధ రైతు కార్మిక ప్రజా సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ పొదిలి కొనకనమీట్ల ల్లో పాక్షికంగా జరిగింది

భారత కమ్యూనిస్ట్ పార్టీ , భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) తెలుగు దేశం పార్టీ ల ఆధ్వర్యంలో కొనకనమీట్ల నందు బ్యాంకులు ప్రభుత్వం కార్యాలయాలను మూసివేయించారు.పొదిలి నందు స్థానిక విశ్వనాదపురం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్, పెద్ద బస్టాండ్, తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహశీల్దార్ షేక్ మహమ్మద్ రఫీ కి వినతి పత్రాన్ని అందజేశారు.

బంద్ సందర్భంగా పట్టణంలో ప్రభుత్వం కార్యాలయాలు, బ్యాంకులు , ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలు మూసివేయిగా వ్యాపార సంస్థలు యథావిధిగా కొనసాగాయి మొత్తం మీద బంద్ పాక్షికంగా జరిగింది.

 

ఈ సమావేశంలో సిపిఐ ప్రాంతీయ కార్యదర్శి కె వి రత్నం , సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపుడి భాస్కర్, పొల్లా నరసింహా యాదవ్ యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,సామంతపుడి నాగేశ్వరరావు, ఆవులూరి యలమంద , కాటూరి నారాయణ ప్రతాప్ మీగడ ఓబుల్ రెడ్డి ముల్లా ఖూద్దుస్, నరసింహారావు,. ఓబయ్య యాదవ్ , తెలుగు యువత నాయకులు కాటూరి శ్రీను, విద్యార్థి విభాగం నాయకులు పండు అనీల్, షేక్ గౌస్ బాషా, యుటియఫ్ నాయకులు రమణారెడ్డి, అబ్దుల్ హై , మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు

కొనకనమిట్ల మండలంలో తెలుగు దేశం పార్టీ నాయకులు మూరబోయిన బాబురావు యాదవ్ , మువ్వా కాటంరాజు, దేవిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జయకుమార్ రెడ్డి, జంబో కొండలు సిపిఎం నాయకులు కోటేశ్వరరావు, శ్రీనివాస్, సిపిఐ నాయకులు శ్రీనివాస్ , కొండయ్య తదితరులు పాల్గొన్నారు.