చదువుల తల్లిని చంపేస్తారా: షేక్ రసూల్
చిత్తూరు జిల్లా పలమనేరులో నిరుపేద టెన్త్ విద్యార్ధిని మిస్బా ఆత్మహత్యపై తెలుగు దేశం పార్టీ మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక పొదిలి మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో షేక్ రసూల్ మాట్లాడుతూ వైసీపీ నేతలపై తనదైన శైలిలో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మిస్బా ఆత్మహత్యకు కారకులుగా నిలిచిన వైసీపీ నేత సునీల్.. అతడికి సహకరించిన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్‌లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మిస్బా చదువుల్లో మేటిగా రాణిస్తూ పదోతరగతి టాపర్‌గా నిలవడం వైకాపా కాలకేయులకి కన్నుకుట్టింది. వైసీపీ నేత తన కుమార్తె టాపర్‌గా రావాలని ప్రిన్సిపాల్‌కి పురమాయించగా..సోడా అమ్ముకునేవాళ్లకు చదువులూ, మార్కులా అంటూ మిస్బాని.. తూలనాడి స్కూల్ నుంచి పంపేయడం చాలా దారుణం. మరో స్కూల్‌లో చేరినా వైకాపా కాలకేయులు ప్రిన్సిపాల్ తనకి చేసిన అవమానం..భవిష్యత్తులోనూ చేస్తామన్న నష్టం హెచ్చరికలు తట్టుకోలేక ఆ చదువులతల్లి బలవన్మరణానికి పాల్పడడం అత్యంత విషాద ఘటన.
బంగారు భవిష్యత్తు ఉన్న చదువుల తల్లి మిస్బా మరణానికి కారణమైన వైకాపాకాలకేయులు ప్రిన్సిపాల్‌లపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్,ఒంగోలు ముస్లిం మైనారిటీ పార్లమెంట్ అధ్యక్షులు షేక్. రసూల్,జిల్లా టి యన్ యస్ యఫ్ కార్యదర్శి షేక్. గౌస్,ఒంగోలు పార్లమెంట్ ముస్లిం మైనారిటీ అధికార ప్రతినిధి షేక్.యాసిన్, నాయకులు మౌలాలి తదితరులు పాల్గొన్నారు.