ఘనంగా 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
75వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు పొదిలి పట్టణం లోని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో జాతీయ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు.
పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు తహశీల్దారు మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ డానియల్ జోసప్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నందు సీనియర్ అసిస్టెంట్ , రోడ్డు భవనాల శాఖ కార్యాలయంలో నందు ఎఈ ప్రభుత్వం వైద్యశాల నందు డాక్టర్ చక్రవర్తి, పొదిలి పోలీసు స్టేషన్ నందు యస్ఐ శ్రీహరి, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఎంపిడిఓ శ్రీకృష్ణ, యస్ ఈ బి స్టేషన్ నందు సిఐ ఖాజా మొహిద్దీన్ జాతీయ జెండా లను ఆవిష్కరించారు.
అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.
పలు ప్రైవేటు ప్రభుత్వ సంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు