కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి దూరం !

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పటి నుంచి సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నాడు. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలతో బిజీగా మారారు. 150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసింది. దాన్ని ఆయన పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల చిరంజీవిని కోరారు రాహుల్‌గాంధీ దీనికి ఆయన నుంచి ఏలాంటి స్పందన లేదుని విశ్వసనీయవర్గాలు సమాచారం