పొదిలి పట్టణంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పొదిలి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు.
శుక్రవారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని జగనన్న లే ఔట్ నందు ఇంటి నిర్మాణ పనుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హౌసింగ్, రెవెన్యూ మున్సిపల్ , సచివాలయం సిబ్బంది తో సమీక్ష నిర్వహించారు తదుపరి మూడో సచివాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సచివాలయం సిబ్బంది యొక్క జాబ్ చార్ట్ ప్రగతి నివేదికను పరిశీలించారు.
బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రాన్ని మరియు నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. అనంతరం కస్తూరి గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి విద్యార్థిని భేటీ అయ్యారు.
కలెక్టర్ పర్యటనలో ఆర్డీవో అజయ్ కుమార్, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ పవన్ కుమార్, డివిజన్ అభివృద్ధి అధికారి సాయి కుమార్, తహశీల్దారు భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్, యస్ఐ మల్లిఖార్జునరావు, గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నరసింహారెడ్డి ,ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు