రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కందుల డిమాండ్ లేకపోతే ఉద్యమబాట తప్పదని ప్రభుత్వానికి హెచ్చరిక
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే సోమవారంనాడు స్థానిక పొగాకు బోర్డును సందర్శించిన కందుల వేలంలో రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదని బోర్డు అధికారులు తెలిపి తక్షణమే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వాలు స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమబాట తప్పదాని ప్రభుత్వాని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య, పొదిలి తెలుగుదేశం పార్టీ నాయకులు పండు అనీల్, షేక్ గౌస్ మరియు కొనకనమిట్ల మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.