మాజీ శాసనసభ్యులు పిచ్చిరెడ్డి మృతి

దరిశి మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చి రెడ్డి అనారోగ్యంతో ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాల నందు చికిత్స పొందుతూ తెల్లవారుజామున‌ తుదిశ్వాస విడిచారు.

కొనకనమీట్ల మండలం పేరరెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన సానికొమ్ము పిచ్చి రెడ్డి ఎంబిబిఎస్ పూర్తి చేసి 1974 పొదిలి పట్టణం వైద్యశాలను ఏర్పాటు చేసి 1989 వరకు నిర్వహించారు.

సింగిల్ విండో ఎన్నికల్లో పోటీతో రాజకీయ ప్రస్థానం మొదలైంది 1985 సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికలలో దర్శి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారపుశెట్టి శ్రీరాములు చేతిలో 291 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓటమి చవిచూసారు.

నూతనంగా ఏర్పాటు చేసిన మండలాల వ్యవస్థ లో 1987లో జరిగిన పొదిలి మండల పరిషత్ అధ్యక్ష‌ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కాటూరి చిన్న నారాయణ స్వామి పైన 2 వేల మెజారిటీతో గెలుపొందారు.

1989 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగినాటి కోటయ్య పై 1286 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

1994 శాసనసభ ఎన్నికలలో దర్శి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించింది అప్పుడు తెదేపా తరుపున గెలుపొందిన నారపుశెట్టి శ్రీరాములు మృతి చెందటం తో 1996 సంవత్సరం లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి నారపుశెట్టి పాపారావు చేతి 9 వేల మెజారిటీతో ఓటమి చవిచూసారు.

1999 సంవత్సరం జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ‌వేమ వెంకట సుబ్బారావు పై 13178 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2004 శాసనసభ ఎన్నికలలో దర్శి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పిచ్చి రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ‌బుచేపల్లి సుబ్బారెడ్డి చేతి ఓటమి చవిచూసారు.

2009 లో ‌ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పొదిలి మండలం మార్కాపురం నియోజకవర్గం పరిధిలోకి రావటంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు.

పొదిలి పట్టణం లో ఆర్టీసీ డిపో ఏర్పాటు, పొదిలి ప్రభుత్వ వైద్యశాలను 30 పడకల ఆసుపత్రి అభివృద్ధి పెద్ద బస్టాండ్ లో బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు మొదలైన చెప్పుకునే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు.

సానికొమ్ము పిచ్చి రెడ్డి పద్మావతి దంపతులకు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి, అపర్ణ, హిమబిందు ముగ్గురు సంతానం. వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం, వై‌వి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబంలతో బంధుత్వం మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చి రెడ్డి మృతి పట్ల పట్టణం శోకసంద్రంలో మునిగిపోయింది.