ముఖ్యమంత్రికి నివేదికను అందజేసిన జి యన్ రావు కమిటీ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది, రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించిన జీఎన్ రావు కమిటీ తమ నివేదికను శుక్రవారం నాడు ప్రభుత్వానికి సమర్పించింనంతరం తమ నివేదికలోని ముఖ్యఅంశాలను కమిటీ సభ్యులు మీడియాకు తెలియజేశారు.
రాష్ట్ర సమగ్రాభివృద్దిని దృష్టిలో పెట్టుకుని రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్దికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 13న ఈ కమిటీని నియమించిందిని తమ కమిటీ సభ్యులు సుమారు 10,600 కిటోమీటర్ల దూరం ప్రయాణించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, విభిన్నవర్గాల వారి నుంచి అభిప్రాయాలను సేకరించిందిని గతంలో రాజధాని మీద విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించి అనంతరం పలు సిఫార్సులు తో నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించామని తెలిపారు.
జీఎన్ రావు కమిటీ సిఫారసులు…
1. అమరావతి, మంగళగిరిలో
హైకోర్టు బెంచ్, శాసనసభ ఉండాలి, ప్రభుత్వ క్వార్టర్లు, గవర్నర్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంచాలి, నాగార్జున యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది అందులో కొత్తగా భూసేకరణ చేయకుండా ఆ భూముల్లో ప్రభుత్వం ఐకానిక్ భవనాలు నిర్మించవచ్చుని , అమరావతిలోని వరదలు వచ్చే ప్రాంతాలను వదిలేసి మిగిలిన ప్రాంతాలను అభివృద్ది చేయాలి
2. విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. వేసవికాలంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీసును నిర్మించాలి.
3. శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నందును కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సిఫారసు.
4. పరిపాలనా సౌలభ్యం కోసం కర్ణాటక తరహాలో కమిషనరేట్ విధానాన్ని అవలంభించాలి. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర కోస్తా (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం), మధ్య కోస్తా (ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు), దక్షిణ కోస్తా (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు), రాయలసీమ (కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం)గా పరిపాలన విభజన చేసుకోవాలి.
5.తుళ్లూరు ప్రాంతంలో ప్రభుత్వం చాలా పెట్టుబడి పెట్టినందున దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి శాఖల తరఫున వాడుకోవాలని సిఫారసు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జోన్లలో వరదలు వచ్చేవాటిని కాకుండా మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధిచేయాలి.
పలురకాల అంశాలుతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి కమిటీ సభ్యులు అందజేశారు.