జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లును పంపిణీ చేసిన ఇమ్మడి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లును మార్కాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాధ్ పంపిణీ చేశారు.
వివరాల్లోకి గురువారం రాత్రి స్థానిక పొదిలి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు నందు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెరుస్వాముల శ్రీనివాసులు అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాధ్ చేతుల మీదుగా కార్యకర్తలకు కిట్లును పంపిణీ చేశారు
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇమ్మడి కాశీనాథ్ దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున జనసైనికులు, వీర మహిళలు భారీ గా హాజరైయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ శైలజ, క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.