ప్రజలను చైతన్య వంతులుగా చేయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం

ప్రజలను చైతన్య వంతులుగా చేయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం అని ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ తెలిపారు. శనివారం నాడు  స్థానిక  పొదిలి పింఛనర్ల భవనం నందు ప్రకాశం జిల్లా కార్యదర్శి దాసరి గురుస్వామి అధ్యక్షతన పొదిలి డివిజన్ సమావేశం జరిగింది

 

ఈ సందర్భంగా దాసరి గురుస్వామి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలనకు, సమాజంలో నెలకొన్న అనేక మూఢనమ్మకాలను నిర్మించుటకు జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రజలందరూ కరోనాను జయించాలంటే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ వేయించుకొని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు.

తదుపరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు జెడ్ రమణయ్య మరియు షేక్ ఖాజా హుస్సేన్ ఏర్పాటుచేసిన సైంటిఫిక్ ఇంద్రజాల ప్రదర్శన నీటితో దీపం వెలిగించడం, నిప్పును మింగడం వంటి ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకొన్నాయి.

 

తదుపరి పొదిలి డివిజన్ నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ యస్ పి బాలయ్య, గౌరవ సలహాదారులు కళ్ళం సుబ్బారెడ్డి, బెల్లంకొండ శ్రీనివాసులు, అధ్యక్షులు
డి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బి దేవప్రసాద్, కోశాధికారి పి ఆంజనేయ చౌదరి, సమతా కన్వీనర్ ఇసుకపల్లి రాఘవమ్మ, ఉపాధ్యక్షులుగా
బి కృపారావు, తోట శ్రీనివాసులు, వై గురువయ్య, వి వి నర్సారెడ్డి, కార్యదర్శులుగా యం వి శ్రీనివాసరావు, షేక్ మదార్ వలి,యం జయ కృష్ణ లను ఎన్నుకొనుట జరిగినది.

ఈ కార్యక్రమంలో యు టి ఎఫ్ నాయకులు షేక్ అబ్దుల్ హై కాశిరెడ్డి నాగార్జున మరియు జె వి.వి నాయకులు గాలి ముట్టి రమేష్, రవీంద్ర బాబు పీ వీ కొండయ్య, కందుల వెంకటరెడ్డి, వై హరిబాబు, కరిముల్లా బేగ్,మస్తానయ్య షాహిద్, దాసరి లక్ష్మి తదితరులు  పాల్గొన్నారు.