కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి

     కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి పరిశీలించారు.

వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కొనసాగుతున్న నేపథ్యంలో మార్కాపురం,దరిశి నియోజకవర్గల ప్రత్యేక అధికారిణి మరియు జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి స్ధానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు డ్రై రన్ పరిశీలించి వైద్యులకు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టరు రమేష్, పొదిలి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ రఫీ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు