కాకి ప్రేమ…పై పొదిలి టైమ్స్ ప్రత్యేక కధనం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

కాకిపిల్లకు కష్టం వచ్చింది… చుట్ట జనాలున్న తన కష్టం ఎవ్వరూ తీర్చలేక పొయ్యారు…. తన తల్లి ప్రేమ ముందర అందురు బలాదూర్ అనిపించింది. ఈ సంఘటన పొదిలిలో జరిగింది… స్దానిక ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో ఒక వేప చెట్టుంది … దానిపైన కాకులు గుడు పెట్టుకొని నివాసం ఉంటున్నాయి… అనుకొని విధంగా తల్లికాకి పిల్లకాకి ఆహారం అందింఛటంలో పిల్ల కాకి జారి క్రింద పడింది… తల్లి కాకి పిల్ల కాకిని చెట్టు మీదకు తీసుకెళ్ళె విఫలయత్నం… కాని సాద్యం కాలేదు పిల్ల కాకి కొద్దిగా బరువు ఉండటంతో ఏమి చేయలేక పొయింది…

అయిన తల్లికాకి నిరుత్సాహ పడలేదు తన చుట్టు కాపాలకాస్తు.. ఎవ్వరైన అటుపొయే ప్రయత్నం చేస్తే తన పదునైన ముక్కుతో పొడిచి పెడుతుంది…
ఇంకా తనే క్రిందికి వచ్చి ఆహారం అందిస్తు తన పిల్లను కాపాడుకుంటు… సమాజానికి తల్లి ప్రేమ చూపిస్తుంది…కాకి పిల్ల కాకిముద్దు….

ఈ సంఘటన ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన రొగులకు చూపరలకు ఆశ్చర్యం కలిగించింది..