కాట్రగుంటలో బాదుడే బాదుడు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే కొనకనమిట్ల మండలం కాట్రగుంట గ్రామ పంచాయతీ నందు తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి వెళ్ళి కరపత్రాలను పంపిణీ చేశారు.

మండల అధ్యక్షుడు మూరబోయిన బాబురావు యాదవ్  మాట్లాడుతూ ఈ ప్రభుత్వం నవరత్నాల పేరుతో బాదుడే బాదుడు అన్నట్టుగా నిత్యావసర ధరలు గ్యాసు ఇసుక పెట్రోల్ డీజిల్ కరెంటు ఆర్టీసీ చార్జీలు మొదలగు పెంచి ప్రజలకు బాదుడే బాదుడు నిర్వహిస్తున్నాయని అన్నారు. రానున్నది టిడిపి పార్టీని అధికారంలోకి వస్తుందని అందుకు ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేయాలని  అన్నారు.

 

ఈ కార్యక్రమంలో నాయకులు చప్పిడి రామలింగయ్య , వరకూటి రామిరెడ్డి,కనకం నరసింహారావు , అంకాల రోశయ్య, దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , యెదుపాటి వెంకటనారాయణ చౌదరి, ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి మువ్వ కాటంరాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పెరి కె సుఖదేవ్,పెరికే రత్నం ,కుందురి కాశీరెడ్డి, జవ్వాజి కాశయ్య నాయుడు,కందెర నాసరయ్య ,తన్నీరు కృష్ణయ్య ,నారాయణరెడ్డి, బాలచెన్నయ్య , కాట్రగుంట పంచాయతీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు