జర్నలిస్టులపై దాడి చేసిన భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలి
ఎయస్పీ, డిఆర్ఓ, సబ్ కలెక్టర్ లకు వినతి పత్రాలు అందజేసిన జర్నలిస్టులు
పొదిలిలో ఆంధ్ర అక్షర రిపోర్టర్ మచ్చ వెంకట రమణపై దాడి చేసిన భూ ఆక్రమణదారులు శ్రావణి వెంకటేశ్వర్లు, అతని అనుచరుడు దమ్మాలపాటి పాపారావులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం నాడు జిల్లా అదనపు యస్పీ రవిచంద్ర కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం దరిశి డియస్పీ చేత విచారం చేయిస్తామని తెలిపాగా అనంతరం కందుకూరు సబ్ కలెక్టర్ కలిసి వినతిపత్రన్ని అందజేయగా త్వరలో నేనే స్వయంగా వచ్చి సమగ్రం విచారణ చేస్తానని అదే విధంగా నిన్ను జరిగిన సంఘటన పై తహశీల్దారును విచారణ జరిపాలని ఆదేశాలు జారీచేశారు.
అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం ను కలిసి జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు పొదిలి పట్టణంలో శ్రావణి వెంకటేశ్వర్లు చేస్తున్న భూ ఆక్రమణల గురించి పూర్తి వివరాలను తెలిపారు.
ముఖ్యంగా వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నున్న ముగ్గురాళ్ల వాగు,తోళ్లమడుగు వాగులు, పంట కాలువలను ఆక్రమించి చేస్తున్న అక్రమ నిర్మాణాల గురించి జిల్లా రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.భూ ఆక్రమణదారులు విలేకరులను , సర్వే చేస్తున్న అధికారులను బెదిరిస్తున్నారని ఆయనకు తెలిపారు.