ఓమిక్రాన్ హెల్ప్ లైన్ ప్రారంభం
భారత మార్క్సిస్టు పార్టీ పశ్చిమ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓమిక్రాన్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ బాలయ్య ప్రారంభించారు.
అనంతరం హెల్ప్ సెంటర్ల నెంబర్ల వచ్చిన కాల్ ను డాక్టర్లు బాలయ్య చెన్న క్రిష్ణయ్య వారితో మాట్లాడి వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు, మందుల వివరాలు సంబంధించిన పూర్తి వివరాలు వారికి తెలిపి వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ మరియు యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు పిల్లి రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి అబ్దుల్ హై, జై వి వి జిల్లా ఉపాధ్యక్షులు దాసరి గురు స్వామి, పొదిలి తాలూకా పెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఏ బాదుల్లా, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్ వివిధ ప్రజా సంఘాల నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హెల్ప్ లైన్ ద్వారా డాక్టర్ బి సీతారామశాస్త్రి, బి హరి బాబు, టి చెన్న కృష్ణయ్య, జి ప్రభాకర్, టి చక్రవర్తి, ఎస్ పి బాలయ్య, మర్రి ధనుంజయుడు, బి శరత్ ల ద్వారా కోవిడ్ బాధితులకు సలహాలు, సూచనలు, గైడెన్స్ ఇస్తా మన్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు : 9949088761, 9492121788, 9346655338, 9985852500 లకు ఫోన్ చేయాలని కోరారు.