ఎల్ ఐ సి ఏజెంట్స్ ల కార్తీక వన భోజనాలు
దర్శి రోడ్ లోని గోశాల వద్ద కార్తీకమాసం చివరి రోజున ఎల్ ఐ సి ఏజెంట్స్ కార్తీక వనబోజనాలు కోలాహలంగా జరిగాయి .కుటుంబ సభ్యులతో సహా అందరూ పాల్గొన్నారు.మహిళలు ఉసిరిచెట్టు వద్ద పూజలుచేసి గోవులను పూజించారు.నివేదనలు సమర్పించారు.గోశాల లో ని కృష్ణుని విగ్రహం వద్ద పూజలు చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. బదిలీ పై పొదిలినుంది ఒంగోలు బ్రాంచ్ కి వెళ్తున్న ఎఓ నాగేశ్వరావు గారి కి ఘానంగా సన్మానామ్ చేశారు.ఆయన సేవలు కొనియాడారు. తనంతరం సామూహికంగా ఉసిరిచెట్ల వద్ద కార్తీక భోజనాలు చేశారు. తరువాత ఆటలపోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందచేశారు.ఈ కాయక్రమంలో డి ఎమ్ అప్పారావు డిడి సుబ్రమణ్యం చిరంజీవి యజ్ఞానారాయన, మార్కాపుర్ ఎల్ యస్ సి ఏజెంట్స్ గౌరవాద్యక్షులు మేడ నరసింహారావు,యన్ వాసు కొండ తిరుపతిరెడ్డి గోశాల అధ్యక్షులు అప్పుల సత్యం పాల్గొన్నారు.