మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్
ప్రకాశం జిల్లా దరిశి పట్టణంలోని సాగర్ కాల్వలో ఆర్టీసీ బస్సు పడి మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
ప్రముఖ వ్యాపారవేత్త బోడే రామచంద్ర యాదవ్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఒక్కరికీ 20 లక్షల రూపాయలు ఆర్థిక చేయూత అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్,మార్కాపురం దరిశి నియోజకవర్గల జనసేన పార్టీ ఇంన్చర్జ్ ఇమ్మడి కాశీనాద్,బోటుకు రమేష్ ప్రాగడ సానుభూతి తెలిపారు
తెలుగు దేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు.
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి దరిశి ప్రభుత్వం వైద్యశాల నందు బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందేలా కృషి చేస్తానని తెలిపారు