మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా పంపిణీ చేసిన మంత్రి ఆదిములపు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
దరిశి సాగర్ కెనాల్ లో బస్సు దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు పురపాలక శాఖ మంత్రి ఆదిములపు సురేష్ చెక్కులు పంపిణీ చేశారు.
శనివారం నాడు స్థానిక పొదిలి పెద్ద మసీదు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆదిములపు సురేష్ చేతుల మీదుగా మృతి చెందిన ఏడుగురికి ఒక్కరికీ 10 లక్షల రూపాయలు గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రకారం మొత్తం 81 లక్ష 50 వేల రూపాయలు విలువైన చెక్కలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి, తహశీల్దారు అశోక్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి , మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కశిరెడ్డి వెంకట రమణ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర రావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, హనీమూన్ శ్రీనివాసులు రెడ్డి మాజీ ఎంపిపి నరసింహారావు , షేక్ నూర్జహాన్, చెన్నారెడ్డి, పులగోర్ల శ్రీనివాస్ యాదవ్, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు
మృ