వర్షంలో ఎంఎల్ఏ కుందూరు పర్యటన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విస్తృతంగా పర్యటించారు.

19వ వార్డు కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వెలుగోలు కాశీ, గంజి సుబ్బారావు,పెరమసాని రమణయ్య, అనుకు సుశాంత్,మందగిరి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కి ఘనస్వాగతం పలికారు

అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పియన్ఆర్ కాలనీ,బెస్తాపాలెం నందు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకొని నోట్ చేసుకున్నాను.

ప్రధాన సాగర్ నీటి సరఫరా గురించి స్థానికులు ఎంఎల్ఏ దృష్టికి తీసుకొని
వచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, జి శ్రీనివాసులు, గుజ్జుల సంజీవరెడ్డి, పట్టణ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్ ప్రధాన కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు