నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మునిసిపల్ కమిషనర్

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కస్తూరి బా గాందీ బాలికల విద్యాలయం నందు నగర పంచాయతీ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు మింగించే కార్యక్రమన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలు సుగన్ కుమార్ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ నులిపురుగుల మాత్రలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ,శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి రావు,ఎయన్ఎం విజయ మహిళా పోలీస్ నాగలక్ష్మి,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కస్తూరి బా గాందీ బాలికల విద్యాలయం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు