వెలుగు అధికారుల వేధింపుల వలనే మా అమ్మ చనిపోయింది- కుమార్తె పరిమిళ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
వెలుగు అధికారుల వేధింపులకు మా అమ్మ నాగలక్ష్మి ఆత్మహత్య పాల్పడినట్లు కుమార్తె పరిమిళ తనను కలిసిన విలేఖరులతో తెలిపారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక పొదిలి మండలం కొండాయిపాలెం గ్రామం నందు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న జనగల నాగలక్ష్మి కి బుధవారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు పంచనామా నిర్వహించి అనంతరం పోస్టుమార్టం చేసి బంధువులకు మృతదేహాన్ని అప్పజెప్పారు.
ఈ మృతురాలు కుమార్తె పరిమిళ మాట్లాడుతూ గత కాలం వెలుగు సిసి వేధింపులు గురి చేస్తున్నారని వారి నుంచి ఫోన్ వస్తే మా తీవ్రంగా భయపడేది అని ఒక రోజు మా అమ్మ ఆరోగ్యం బాగా లేక ఒంగోలు వెళ్లి నప్పుడు సెల్ ఇంటి దగ్గర పెట్టి పోయినప్పుడు నేను మాట్లాడినప్పుడు వెలుగు సిసి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడు అని తీవ్ర ఆవేదనతో చెప్పింది
కావున తన తల్లి ఆత్మహత్య కు కారణమైన వెలుగు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది