ఆర్టీసీ ఎన్నికల్లో ఎన్ఎంయు అభ్యర్థి ఘన విజయం
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ పొదిలి డిపో ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ అభ్యర్థి సిద్దెల సాల్మన్ రాజు విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల పొదుపు పరిమితి సహకార సంస్థ పొదిలి డిపో విభాగ ప్రతినిధి ఎంపిక కోసం జరిగిన ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ అభ్యర్థి షేక్ ఖాదర్ భాషా 146 ఓట్లురాగా నేషనల్ మజ్దూర్ యూనియన్ కూటమి అభ్యర్థి సిద్దెల సాల్మన్ రాజు 227 ఓట్లు లభించాయి దాని తో నేషనల్ మజ్దూర్ యూనియన్ అభ్యర్థి సిద్దెల సాల్మన్ రాజు 81 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
నేషనల్ మజ్దూర్ యూనియన్ అభ్యర్థి విజయం తో సంబరాలు అంబరాన్ని తాకేలా నిర్వహించారు.