కళ్యాణం వైపు కాదు కళాశాల విద్య వైపు :సిడిపిఓ సుధా మారుతి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
అంతర్జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని పొదిలి బాలికల ఉన్నత పాఠశాలలో సిడిపివో సుధా మారుతి ఆధ్వర్యంలో బాలికా ప్రకాశం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిడిపిఓ సుధా మారుతి మాట్లాడుతూ ఆడబిడ్డల ప్రాముఖ్యతను ప్రపంచానికే చాటి చెప్పేందుకు ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా జరుపుకుంటున్నమని ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై ఉండే వివక్షతను హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించి.. పదవ తరగతి పూర్తి అయిన వెంటనే కళాశాల విద్య వైపు అడుగులు వేయాలని కళ్యాణం వైపు కాదు అని బాలికా సంరక్షణ చట్టాలను విద్యార్థులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి,పాఠశాల ఉపాధ్యాయురాలు రోజా రాణి ఉపాధ్యాయులు మరియు ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు