ఇండియన్ బ్యాంక్ పొదిలి శాఖ ప్రారంభం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణం దర్శి రోడ్ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో మంగళవారం నాడు ఇండియన్ బ్యాంక్ పొదిలి శాఖను ఫీల్డ్ జనరల్ మేనేజర్ గణేష్ రామన్ లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం స్థానిక పొదిలి శాఖ మేనేజర్ కటకం గోపాలరావు అద్యక్షతనతో జరిగిన ఖాతాదారుల సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఫీల్డ్ జనరల్ మేనేజర్ గణేష్ రామన్, జోనల్ మేనేజర్ డి యస్ మూర్తి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కృష్ణ మోహన్ మరియు స్థానిక వ్యాపారులు గునుపూడి చెంచు సుబ్బారావు, గునుపూడి మధుసూదన్ రావు తదితరులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా పొదిలి బ్యాంకు మేనేజర్ కటకం గోపాలరావు ను ఘనంగా సత్కరించారు.