పెళ్లి ఇంటా విషాదం రోడ్డు ప్రమాదం లో నాలుగురు మృతి
కొనకనమీట్ల మండలం గార్లదిన్నే సమీపంలో బోలరో వాహనం నుంచి జారి పడి నాలుగురు మృతి చెందటం పెళ్లి ఇంటా విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళితే పెద్దారవీడు మండలం తోకపల్లి పంచాయతీ సోమేపల్లి గ్రామం చెందిన యువతి తో పొదిలి మండలం అక్కచెరువు గ్రామ చెందిన యువకుడు తో పెళ్ళి నిశ్చయం అయ్యింది బుధవారం నాడు వివాహానికి పెళ్లి కూతురును తీసుకొని బైలుదేరగా కొనకనమీట్ల మండలం గార్లదిన్నే సమీపంలోకి రాగానే బోలరో వాహనం నుంచి ప్రమాదవశాత్తు కింద పడి శ్రీను , బోగాని సుబ్బారావులు అక్కడి అక్కడే మృతి చెందగా కనకం కార్తిక్ (13) కనకం అనిల్ (12) పరిస్థితి. విషమంగా ఉండటంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల తరలించగా అక్కడ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
విషయం తెలుసుకున్న కొనకనమీట్ల,తర్లుబాడు యస్ఐ శివ, చౌడేశ్వరి లు సంఘటన చేరుకొని ప్రమాదం జరిగినా తీరు పరిశీలించి మార్కాపురం ప్రభుత్వం వైద్యశాల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంకా కొద్ది గంటల్లో వివాహం జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన తో పెళ్ళి ఇంటా విషాదం నెలకొంది