సమ్మెకు దిగిన పొదిలి నగర పంచాయితీ కార్మికులు
పొదిలి నగర పంచాయితీ కార్మికుల ఆరు ఆరు నెలల జీతాలు చెల్లించకపోవడంతో నిరసిస్తూ విధులను బహిష్కరించి నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
వివరాల్లోకెళ్తే శుక్రవారం నాడు విధులను బహిష్కరించిన నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లారు
స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేసి ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా భిక్షాటన నిర్వహించారు
కార్మికుల సమ్మెకు కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మరియు సిఐటియు యూనియన్ మద్దతు ప్రకటించాయి.
ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి షేక్ సైదా మాట్లాడుతూ నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , పురపాలక శాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకొని వారికి చెల్లించవలసిన 6 నెలల జీతాన్ని చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు రఫీ మాట్లాడుతూ కార్మికులకు న్యాయబద్ధంగా చెల్లించవలసిన ఆరు నెలల జీతం మరియు పెండింగ్ మరియు ఇతర అరియర్స్ ను మరియు ఇటీవల కోవిడ్ తో మరణించిన నగర పంచాయతీ కార్మికుడికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారులు స్పందించకపోతే ఈ సమస్యపై జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షులు రఫీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.