పొగాకు కొనుగోలు ప్రారంభం

పొదిలి పొగాకు వేలం కేంద్ర నందు గురువారం నాడు పొగాకు కొనుగోలును ప్రారంభించారు మొదటి రోజు 9 బేళ్లు రాగ వాటి ధర 164 రూపాయలు ప్రకారం కంపెనీలు కొనుగోలు చేసాయి ఈ సందర్భంగా రైతు నాయకులు సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి గుంటూరి సుబ్బయ్య మాట్లాడుతూ కనీసధర 176 నుండి కొనుగోలు ప్రారంభం చేయలని అధికారులకు కంపెనీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేసారు ఈ కార్యక్రమంలో పొదిలి వేలం కేంద్రం నిర్వహణ అధికారి రాజ్ ప్రకాష్ వెల్లంపల్లి వేలం కేంద్రం అధికారి ఆర్ శ్రీనివాస్ నాయుడు మరియు కంపెనీల బయ్యర్లు రైతులు వేలం కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు