పొదిలిటైమ్స్ సంక్రాంతి సంబరాలు… ముగ్గులు, పతంగుల పోటీలు
సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పొదిలిటైమ్స్ ఆధ్వర్యంలో ముగ్గులు, పతంగుల పోటీలు నిర్వహించనున్నారు.
వివరాల్లోకి వెళితే సంక్రాంతి సంబరాలలో భాగంగా పొదిలిటైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ముగ్గుల పోటీలు జనవరి 14వతేదీన మంగళవారంనాడు భోగి పండుగ రోజున స్థానిక నిర్మమహేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం(శివాలయం) నందు మరియు పతంగుల పోటీలు నిర్వహించబడును.
ముగ్గుల పోటీలలో పాల్గొనదలచిన వారు వారికి సంబంధించిన సామగ్రి వారే తెచ్చుకొని….. అలాగే పతంగుల పోటీలో పాల్గొనేవారు పతంగులను తీసుకుని….. మంగళవారంనాడు మద్యాహ్నం 2 నుండి 3గంటలలోపు వారి పేర్లను నమోదు చేసుకోవాలని….. అలాగే పోటీలు 3గంటల నుండి ప్రారంభం అవుతాయని పొదిలిటైమ్స్ యాజమాన్యం తెలిపింది.