ప్రభుత్వ ఆదేశాలను పాటిద్దాం – కరోనా వ్యాప్తిని నిరోధిద్దాం

క్వారెంటైన్ నోటీసులు అందుకోకుండా ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వానికి తెలియజేద్దాం

పోలీస్, రెవెన్యూ, వైద్య, పంచాయతీ రాజ్ శాఖల సిబ్బందికి సంఘీభావం తెలుపుదాం

పొదిలి టైమ్స్ పిలుపు 

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జరుగుతున్న లాక్ డౌన్ కార్యక్రమాన్ని మనమందరం తూచా తప్పకుండా పాటించి సామాజిక దూరాన్ని పాటిస్తూ నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇంటిలోని 20నుంచి 45సంవత్సరాల వయస్సు నిండిన వారే బయటకు వేస్తే మంచిది….. దానితో పాటు ఇంటి నుంచి బయటకు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉంటే కరోనా మహమ్మారి నుండి మన తల్లిదండ్రులు మన పిల్లలను కాపాడుకోవడానికి దోహదపడుతుంది.

ప్రస్తుతానికి 70శాతం ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు మిగిలిన 30శాతం మందిని కూడా మనం చైతన్యపరిచి వారిని కూడా ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే విధంగా మనమందరం కృషిచేసి కరోనా వ్యాప్తిని నిరోధిద్దాం.

వివిధ దేశాల నుండి మరియు వివిధ రాష్ట్రాల నుండి పొదిలికి వచ్చి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా క్వారెంటైన్ నోటిసులు అందుకోకుండా ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయడం బాధ్యత కలిగిన పౌరుడి లక్షణం కాబట్టి మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఉన్న వారిని గుర్తించి సంబంధించిన సమాచారాన్ని పొదిలి టైమ్స్ కు తెలియజేయండి (లేక) సంబంధించిన శాఖల అధికారులు తెలియజేయండి.

పోలీసు , రెవెన్యూ, వైద్య , పంచాయతీ రాజ్, గ్రామ వాలంటీర్ల సేవలకు సంఘీభావాన్ని ప్రకటించి వారికి పూర్తిగా సకరిస్తారని ఆశిస్తూ……

సదా మీ సేవలో
పొదిలి టైమ్స్ యాజమాన్యం.