పిఆర్సీ పిట్మెంట్ 30 శాతం ఇవ్వాలని ర్యాలీ ధర్నా
ఆంద్రప్రదేశ్ ఉద్యోగులకు 30 శాతం మూల వేతనం తగ్గకుండా ఇవ్వాలని ఏపిటిఏఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎపిటియఫ్) రాష్ట్రశాఖ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని పాత తాలూకా కేంద్రమైన పొదిలిలో మంగళవారం నాడు ఏపిటిఏఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పెద్ద బస్టాండ్ నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పి.ఆర్.సి 30 శాతం తగ్గకుండా ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేయాలని హెచ్ఆర్ఏ పాత స్లాబుల విధానాన్ని కొనసాగించాలని, పెన్షనర్లకి అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పాత పద్దతిలో కొనసాగించాలని, 3, 4, 5, తరగతులను ఉన్నత పాఠశాలలో విలీన పరుస్తూ వచ్చిన 172 వ మేమోను, 85 జి.ఓ ను రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని పొదిలి తహశీల్దార్ కి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపిటిఏఫ్ జిల్లా అధ్యక్షులు వి జనార్దన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి, షేక్ ఖాదర్ బాష, రాష్ట్ర కౌన్సిలర్ కొప్పాకుల శ్రీనివాసులు, మర్రిపూడి మండల అధ్యక్షుడు బిడి కిషార్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా కౌన్సిలర్ యం వి నారాయణ, పొదిలి మండల బాధ్యులు పి హరిబాబు, ప్రధాన కార్యదర్శి మంచికల కోటేశ్వరరావు , ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.