తెలుగుదేశం ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో చిన్న బస్టాండ్ నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ బియ్యం మొదలైన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే వాటిని తగ్గించకుండా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని ప్రజలు అడిగిన సినిమా టికెట్ ధరలను తగ్గించి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి ఆవూలూరి యలమంద, తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పండు అనీల్, తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, మండల పట్టణ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్, పట్టణ నాయకులు జ్యోతి మల్లి,నరసింహారావు టి యన్ యస్ యఫ్ పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా తెలుగు యువత నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు సుకదేవ్ మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు