ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నుంచి పెద్ద బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం పట్టణంలోని మండల పరిషత్ పాఠశాల నందు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి నోటిని శుబ్రపరిచే పద్ధతిని దంత వైద్యురాలు బాసంతి దాస్ వివరించారు
అనంతరం ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల వాడకం వలన వచ్చే వ్యాధులు గురించి వాటి నివారణ గురించి నోటి క్యాన్సర్ గుర్తించే స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ చక్రవర్తి, బాసంతి దాస్, డాక్టర్ రఫీ, డాక్టర్ అఖిల రెడ్డి మరియు ఎయన్ఎంలు తదితరులు పాల్గొన్నారు