పొదిలి పోలీసు స్టేషన్ వద్ద రామచంద్ర యాదవ్ ఆందోళన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

సల్లూరు ఘటన పై సల్లూరు గ్రామస్తులు తో కలిసి పొదిలి పోలీసు స్టేషన్ వచ్చిన భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ను స్టేషన్ లోకి ఒక్కరినే వెళ్లాలని పోలీసులు సూచన చేయటం తో బాధితులు లేకుండా లోపలకు వచ్చేది లేదని తెలియజేయడంతో పోలీసులు, యాదవులు మద్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది.

పోలీసులు వైఖరిని నిరసిస్తూ ఒంగోలు -కర్నూలు జాతీయ రహదారిపై రామచంద్ర యాదవ్ తన అనుచరులతో బైటాయించటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది

గ్రామస్తులు, పోలీసులు మద్య పరస్పరం తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది

మహిళాలు పై పోలీసులు దురుసు ప్రవర్తన తో మహిళలు తీవ్ర ఆగ్రహంతో పోలీసులు పైకి గొడవా దిగటం తో పరిస్థితి ఉద్రిక్తం ఏర్పడింది

పోలీసులు, సల్లూరు గ్రామస్తులు మద్య తీవ్ర పెనుగులాట, తొపులాట మద్య తీవ్ర గందరగోళం నెలకొంది.

బిసివై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ను అడ్డుకొనేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.

జాతీయ రహదారిపై వందలాది వాహనాలు ఆగిపోవటం తో ప్రయాణికుల దృష్ట్యా ఆందోళనను విరమించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న సల్లూరు గ్రామంలో దురుసుగా ప్రవర్తించిన పొదిలి సిఐ యస్ఐలను సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా యాదవ మహాసభ నాయకులు, సల్లూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు