రథోత్సవ పనులు లాంఛనంగా ప్రారంభం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నాటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం రథం మరమ్మతులు పనులను లాంఛనంగా ప్రారంభించారు.

తొలుత ఆలయం ప్రధాన పూజారి సుబ్బా నారసయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవం పనులు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాసులు ధర్మకర్త మండలి ఛైర్మన్ యక్కలి శేషగిరిరావు , రథసారథి సమంతపూడి నాగేశ్వరరావు, పట్టణ ప్రముఖులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, కాటూరి వెంకట నారాయణ బాబు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, జి‌ శ్రీనివాసులు, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వినోద్, కొత్తూరి శ్రీను, భూమ రమేష్, వాకా సుబ్బారెడ్డి ,‌చెన్నారెడ్డి , హనిమున్ శ్రీనివాసులురెడ్డి, యర్రముడి వెంకటేశ్వర యాదవ్, వెంకట నారాయణ రెడ్డి,యుద్దం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు