స్థానిక తహశీల్దార్ కార్యాలయం పక్కనే గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను మార్కాపురం ఆర్డీఓ రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మధ్యాహ్న భోజనం మెనూ సరిగా అమలు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం తయారీ సమయంలో పరిశుభ్రత పాటిస్తున్నారా….. రుచికరమైన భోజనం పెడుతున్నారా అని పరిశీలించారు. అనంతరం విద్యార్ధులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ తహశీల్దార్ యస్ఎం హమీద్, ఉప తహశీల్దార్ జానీ బేగ్, ఆర్ఐ సుబ్బరాయుడు, రెవిన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.