ఆక్రమణకు గురైనా ప్రభుత్వం భూములను పరిశీలించిన ప్రత్యేక సబ్ కలెక్టర్ శ్రీదేవి
పొదిలి నగర పంచాయితీ పరిధిలో ఆక్రమణకు గురైనా ప్రభుత్వం భూములను ప్రత్యేక సబ్ కలెక్టర్ శ్రీదేవి పరిశీలించారు.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద ఆక్రమణకు గురైనా తోపు పోరంబోకు భూమిని అక్రమంగా అసైన్మెంట్ భూముల్లో వేసిన లే ఔట్ ను మరియు పైలెట్ ప్రాజెక్టుగా డ్రోన్ కెమెరా తో చేసే డిజిటల్ సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ శ్రీదేవి పరిశీలించారు.
అనంతరం పొదిలి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఉన్న లే ఔట్ ను మరియు ఆక్రమణకు గురైనా వాగును మరియు అక్రమణ జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పొదిలి కొండ లక్ష్మి నరసింహ స్వామీ దేవస్థానం చెందిన భూములను ప్రత్యేక సబ్ కలెక్టర్ శ్రీదేవి పరిశీలించారు.
జూలై 1వ తేదీ నాటికి సర్వే పూర్తి చేసి సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చెయ్యాలని తహశీల్దారు హనుమంతరావు కు ఆదేశాలు జారీ చేశారు.
అక్రమణకు గురైనా భూముల నివేదిక వచ్చిన తర్వాత ఆక్రమణదారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.
ప్రత్యేక సబ్ కలెక్టర్ శ్రీదేవి వెంట పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, సర్వేయర్ బ్రహ్మం, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు