ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయ్యాలి వి శ్రీనివాసరావు సిపియం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఒంప్పద ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా క్రమబద్దీకరణ చేయ్యాలని భారత భారత మార్క్సిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు మర్రిపూడి మండల తహశీల్దార్ కార్యాలయం నందు పట్టభద్రుల ఓటు నమోదు కోసం దరఖాస్తు అందజేసిన సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఒప్పంద లెక్చరర్లు మరియు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఉద్యోగులుగా క్రమబద్దీకరణ చేస్తానని హామీ ఇచ్చారని కాని ఇప్పుడి వరకు అమలు పర్చాలేదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి వినతిపత్రాన్ని అందజేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పొదిలి ప్రాంతీయ కార్యదర్శి యం రమేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు