చంద్రబాబు ను కలిసిన యస్ యం భాషా
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మంగళగిరి తెలుగు దేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం నందు శనివారం నాడు మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమాన్వయ కమిటీ సభ్యులు షేక్ మహబూబ్ బాషా, పొదిలి పట్టణ నాయకులు ముల్లా జిలానీలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అదే విధంగా పార్టీ కార్యకర్తలకు న్యాయ విభాగం ద్వారా అండగా ఉండాలని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిరంతరం ప్రజల్లో మమేకమై ప్రజలకు అండగా ఉండాలని కోరినట్లు యస్ ఎం బాషా ఒక ప్రకటన తెలిపారు