కందుల ఆధ్వర్యంలో సాగర్ నీటి సరఫరా కై ధర్నా
పొదిలి మండలం లో గత 16 రోజుల నుంచి సాగర్ నీటి సరఫరా లేకపోవడంతో తక్షణమే సాగర్ నీటి సరఫరా కొనసాగించాలని కోరుతూ మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా ఉద్దేశించి కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరంలో పొదిలి పట్టణానికి త్రాగటానికి మంచినీటి సరఫరా చెయ్యాలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని అన్నారు.
గత 16 రోజుల నుంచి సాగర్ నీటి సరఫరా నిలిచిపోయిన ఈ ప్రభుత్వం పట్టించుకొని పాపాన పోలేదని 16 రోజుల నుంచి మంచి నీరు త్రాగకుండా ప్రజాలు ఎలా ఉంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మంచినీటి కోసం దరిశి వెళ్లి నీరు తెచ్చుకొనే పరిస్థితి ఏర్పడిందని గత
16 రోజుల నుంచి కాంట్రాక్టర్ , అధికారులు ఏమి ఏమి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
ఇప్పటికైనా అధికారం స్పందించి తక్షణమే మంచినీటి సరఫరాకునకు సాగించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిందే ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అనంతరం స్థానిక మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ తో మంచి నీటి సరఫరా తక్షణమే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు, కాటూరి నారాయణ ప్రతాప్ , యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, పోల్లా నరసింహా యాదవ్, సమంతపూడి నాగేశ్వరరావు ,సయ్యద్ ఇమాంసా మీగడ ఓబుల్ రెడ్డి ముల్లా ఖూద్దుస్, పండు అనిల్, యస్ ఏం భాషా, షేక్ గౌస్ భాష, కాటూరి శ్రీను, జ్యోతి మల్లి,నరసింహారావు , తెలుగు మహిళ నాయకురాలు షేక్ షన్వాజ్ మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు