రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పొదిలి సంస్కృతి విద్యార్థులు ప్రతిభ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
గుంటూరు చలపతి ఫార్మసిటీ కాలేజీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెస్ పోటీల్లో పొదిలి సంస్కృతి విద్యార్థులు ప్రతిభ చూపించారు
ఆదివారం నాడు జరిగిన ఈ పోటీలలో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది పైగా పాల్గొన్న పోటీలలో అండర్ సెవెన్ ఓపెన్ కేటగిరి తో జువాజీ విగ్నేష్ గుప్తా రెండో స్థానం సాధించగా అండర్ మహిళలు విభాగంలో శివాజీ పాండ్యా శ్రీవల్లి నాలుగో స్థానం సాధించారు.
ఈ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపిన సంస్కృతి విద్యార్థులకు పొదిలి పట్టణ ప్రముఖులు మరియు విద్యా సంస్థ యాజమాన్యం తల్లిదండ్రులు పలువురు అభినందించారు