అయోధ్య శ్రీరామ మందిరం అక్షింతలతో శోభా యాత్ర
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో ఆదివారం నాడు హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభా యాత్ర నిర్వహించారు.
అయోధ్య శ్రీరామ జన్మభూమి లో భవ్యమైన దివ్యమైన రామ మందిరం జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవం సందర్భంగా పొదిలి పట్టణంకు వచ్చిన అక్షింతలు తో ఆంజనేయస్వామి దేవాలయం నుండి పెద్ద బస్టాండు, రథం రోడ్, చిన్న బస్టాండ్, ఆంజనేయస్వామి దేవాలయం వరకు భారీ శోభా యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కోలాటం సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి, గునుపూడి భాస్కర్, కుప్పం ప్రసాద్, గునుపూడి మాధవి , పందింటి మురళి, వెన్నెల శ్రీనివాస్ మరియు వివిధ హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు