నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: వ్యవసాయ అధికారి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
నకిలీ విత్తనాలు అమ్మిన, అధిక ధరల విక్రయించిన కఠిన చర్యలు తప్పవని పొదిలి మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులబ్దిన్ హెచ్చరించారు.
మంగళవారంనాడు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ నిర్వహించి దుకాణాలలో ఎరువులు ఎంత స్టాక్ ఉన్నది, రిజిస్టర్లో నమోదు చేశారా లేదా, అమ్మకానికి లైసెన్స్ ఉన్నదా లేదా, విత్తనవిక్రయానికి అనుమతులు ఉన్నాయా లేవా, రైతులకు సక్రమంగా బిల్లులు ఇస్తున్నది లేనిది వివరాలను పరిశీలించారు.
అదేవిధంగా దుకాణాల్లో నకిలీ విత్తనాలు గాని కాలం చెల్లిన విత్తనాలు గాని ఉన్నాయేమో అని ఆయన పరిశీలించారు.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా కాలపరిమితి ఉందా లేదా అనే విషయం చూసుకొని కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన వాటికి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని వ్యవసాయ అధికారి షేక్ జైనులబ్దిన్ సూచించారు.
ఈ తనిఖీల్లో భాగంగా ఐదు సజ్జ విత్తనాల నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు వెంట ఉన్నారు