చదువులు కొత్తదారులు సెమినార్ ప్రారంభం
పొదిలిలోని స్దానిక బాలికల ఉన్నత పాఠశాలలో చదువులు…కొత్త దారులు అనే కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ విద్యాశాఖ కమీషనర్ వాడరేవు చిన వీరభద్రుడు హాజరైయ్యారు
తొలుత పుస్తకాల ప్రదర్శన, పురాతన నాణేలు, బెస్ట్ ప్రేమ్ వేస్ట్ వస్తువులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లను ప్రారంభించి తిలకించారు
పొదిలి కి చెందిన భావకవి, స్వాతంత్ర్య సమర యోధుడు నాయిని సుబ్బారావు పేరు మీద పాఠశాల వేదికకు నామకరణం చేశారు…
ఈకార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి నరసింహరావు, గుంటూరు ఆర్ జె డి ఎస్.సుబ్బారావు ,రచయిత పాపినేని సాయి బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.