పొదిలి నగర పంచాయితీ పరిధిలోని అక్రమకట్టడాలను తొలగిస్తాం
తెలుగు దేశం పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలని మరియు పొదిలి నగర పంచాయతీ పరిధిలోని అక్రమకట్టడాలను తొలగిస్తామని మార్కాపురం నియోజకవర్గం శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు.
పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటిని నెరవేర్చిందని అన్నారు పొదిలి పెద్ద చెరువు సమ్మర్ స్టోరేజ్ సంబంధించి నీటి వాటా కేటాయింపు ప్రక్రియ పూర్తి అయ్యాక స్టోరేజ్ సంబంధించి పనులు ప్రారంభం జరిగిందని అన్నారు.
పచ్చ మీడియా ఉన్నాయి లేనియి కల్పించుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని వారి దుష్ప్రచారం తప్పితే రాష్ట్ర అన్నిరంగాల్లో అభివృద్ధి లో దూసుకుపోతుందని అన్నారు.
ఈ సమావేశంలో వైకాపా నాయకులు జి శ్రీనివాసులు , గొలమారి చెన్నారెడ్డి ,వాకా వెంకట రెడ్డి షేక్ రబ్బానీ , గుంటూరి పిచ్చి రెడ్డి,హనిమున్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు