సత్కార కార్యక్రమానికి తెదేపా ఎంపిటిసిలు దూరం…. నీటి సమస్య పరిష్కారంలో చొరవచుపాలని డిమాండ్ చేసిన ఎంపిటిసి ఇమాంసా
మండల పరిషత్ సర్వసభ్య సమావేశ కార్యక్రమానికి హాజరైన తెదేపా ఎంపిటిసిలు సన్మాన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.
వివరాల్లోకి వెళితే మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో మండలంలోజరిగిన అభివృద్ధి, లోటుపాట్లను గురించి జరిగిన సమావేశం అనంతరం ఎంపిటిసి సభ్యులకు ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో తెదేపా ఎంపిటిసిలు డుమ్మా కొట్టారు.
తొలుత ఎంపిటిసి సభ్యులు షేక్ ఇమాంసా మాట్లాడుతూ పట్టణంలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్లలో అవినీతి జరగకుండా చర్యలు తీసుకోవాలని…… ప్రజలందరికీ పక్షపాతం లేకుండా నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాలని శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డిని కోరారు. అనంతరం కార్యక్రమంలో చివరిగా జరిగిన సన్మాన కార్యక్రమంలో తెదేపా ఎంపీటీసీలు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.