పొదిలి మండలంలో విస్తృతంగా పర్యటించిన కందుల
100 ఓటర్లు కు ఒక పసుపు దళ కోఆర్డినేటర్ ఎంపిక
గ్రామ కమిటీలు ఏర్పాటు చేసిన కందుల
మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి మండలాల పర్యటనలో భాగంగా సోమవారం నాడు పొదిలి మండలం అన్నవరం, తలమల్ల ఉప్పలపాడు, యోలూరు గ్రామ పంచాయతీల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలుకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, తెలుగు దేశం పార్టీ పార్లమెంటు కమిటీ నాయకులు పొల్లా నరసింహా యాదవ్, మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్ విద్యార్థి విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, పొదిలి మండల పట్టణ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్, మండల తెలుగు దేశం పార్టీ నాయకులు పండు అనీల్, సయ్యద్ ఇమాంసా, జ్యోతి మల్లి, ముని శ్రీనివాస్, మండల తెలుగు యువత నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, కాటూరి శ్రీను వివిధ గ్రామాల తెలుగు దేశం పార్టీ నాయకులు పులి వెంకటేశ్వరరెడ్డి, వెంకట్రావు,
తదితరులు పాల్గొన్నారు