ముఖ్యమంత్రి విభజన హామీలు, ప్రత్యేక హోదాలపై కేంద్రం మీదా ఒత్తిడి చేయ్యాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు

తిరుపతిలో ఆదివారం నాడు హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతనతో జరిగే సదరన్ ముఖ్యమంత్రుల సమావేశంలో విభజన హామీలు,ప్రత్యేక హోదా, రామాయపట్నం పోర్ట్ మొదలైన అంశాల పై ఒత్తిడి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గం సభ్యులు వై వెంకటేశ్వరరావు అన్నారు.

స్థానిక పశ్చిమ ప్రకాశం సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి తగ్గించాలని మరియు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ విలేఖరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాలా అంజయ్య, పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ హనీఫ్ జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు గాలి వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.